లెజెండరీ అవార్డును చంద్రమోహన్‌కు జీవన సాఫల్య అవార్డు కవితలకు ప్రకటించారు
- November 25, 2016
అలనాటి మేటి కథానాయకుడు, సీనియర్ నటుడు చంద్రమోహన్, నాటి మేటి హీరోయిన్, నటి కవిత బుల్లితెరపై ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. విబి (విష్ణు బొప్పన) ఎంటర్టైన్మెంట్స్ -2016 పురస్కారాల్లో లెజెండరీ అవార్డును చంద్రమోహన్, జీవన సాఫల్య పురస్కారాన్ని నటి శ్రీమతి కవితలకు ప్రకటించారు. ప్రభాకర్ ఆల్‌రౌండర్ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ పురస్కారాల్ని డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగే ఓ ప్రయివేటు కార్యక్రమంలో అందించనున్నామని అవార్డు కర్తలు విష్ణు బొప్పన తెలియజేశారు. వెండితెర, బుల్లితెర నటీనటులు, ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో పలువురు పేద కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
బుల్లితెరపై వివిధ రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాల్ని అందిస్తూ గతేడాది విబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ పురస్కారాల్ని ప్రారంభించింది. 2015లో సీనియర్ నటులు రంగనాథ్, రాళ్లపళ్లి వంటి ప్రముఖులకు పురస్కారాల్ని అందించింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







