పెట్టుబడుల నిమిత్తం గల్ఫ్ వెళ్లనున్న చంద్రబాబు
- November 25, 2016
నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆహ్వనించడం కొరకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలను శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర సలహాదారు డాక్టర్ వేమూరి రవి కుమార్ కువైట్ లోని ఎపి ఎన్నార్టీ కో ఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్లో వెల్లడించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వచ్చె నెల 11,12,13 తేదిలలో చంద్రబాబు నాయుడు దుబాయ్, ఆబుధాబి మరియు కువైట్లలో పర్యటించనున్నారు, ఈ మూడు నగరాలలో కూడ చంద్రబాబు నాయుడు ఆయన వెంట రానున్న ఉన్నత స్ధాయి అధికారిక బృందం గల్ఫ్ అరబ్బు వ్యాపారవేత్తలతో సమావేశం జరపనుంది. ఈ మూడు చోట్లకు చెందిన స్ధానిక ప్రవాస మరియు కొందరు అరబ్బు వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గత కొంత కాలంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
తన పర్యటన సందర్భంగా అల్ ముక్తుమ్, అల్ నహ్యాన్ మరియు అల్ సభా మూడు రాజ కుటుంబీకుల ప్రతినిధులతో కూడ సమావేశం కావడానికి ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లుగా సమాచారం.తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రుల సంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోనున్న కొన్ని ముఖ్య ప్రకటనలు కూడ చేస్తారని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానులు నిర్వహించె కొన్ని కార్యక్రమాలలో కూడ పాల్గోంటారని సమాచారం. ముఖ్యమంత్రి రాక కొరకు అక్కడి తెలుగు ప్రజలు అతృతతో ఎదురు చూస్తున్నారు.కాని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏలాంటి వివరాలను వెల్లడించడానికి సంబంధిత వర్గాలు ఇష్టపడడం లేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







