బిల్లు ఆమోదించిన కెనడా పార్లమెంట్
- November 25, 2016
దాదాపు ఐదేళ్లకు పైగా విదేశాలలో స్థిరపడిన ప్రవాసులకు ఓటు హక్కును విస్తరించేందుకు ఉద్దేశించిన బిల్లును కెనడా పార్లమెంట్ గురువారం ఆమోదించింది. విదేశాలలో నివశిస్తున్న కెనడా పౌరులు తమ ఓటర్ సమాచార కార్డులను గుర్తింపు కార్డులుగా ఉపయోగించుకుని ఓటింగ్‌లో పాల్గనవచ్చని ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రజాతంత్ర వ్యవస్థల మంత్రి మర్యం మాన్సెఫ్ చెప్పారు. ప్రవాసులకు ఓటు హక్కు కల్పించటం ద్వారా దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. ఈ చట్టంలో నిబంధనలు మెరుగుపర్చేందుకు, మార్పులు చేసేందుకు అవసరమైతే ప్రతిపక్షాలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆమె చెప్పారు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం అర్హులైన కెనడియన్లకు ఓటు హక్కు మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించామన్నారు. ఈ చట్టానికి ఆమోదముద్ర లభిస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని ఆమె చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు ద్వారా విదేశాలలో స్థిరపడిన దాదాపు పదిలక్షల మందికి పైగా కెనడా పైరులకు ఓటు హక్కు లభిస్తుందని ప్రభుత్వం వివరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







