జెడ్డా నుంచి వచ్చే విమానంలో భారత యాత్రికుని మృతి
- November 25, 2016
మస్కట్ : పుణ్యక్షేత్ర సందర్శన తర్వాత ఆ ఆత్మ సంతృప్తి చెంది తనువు చాలించిందేమో అన్నట్లుగా ఒక భారతీయ వ్యక్తి విమానంలో ప్రాణాలు విడిచాడు. వివరాలలోకి వెళితే, సౌదీ విమానసంస్ధ కు చెందిన విమానం జెడ్డా నుంచి భారదేశంకు ప్రయాణిస్తుండగా ఒక భారతీయ తీర్ధ యాత్రికుడు మరణించిన సందర్భంలో ఆ విమానాన్ని ఒమాన్ వైపునకు మళ్లించారు. దక్షిణ భారతదేశం తమిళనాడు రాష్ట్రంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ (63) తీర్ధయాత్ర ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో సహా జెడ్డా నుండి స్వదేశానికి తిరిగివస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఉమ్రా సమూహ నాయకుడు మఖ్సూబ్ సాహిబ్ తెలిపిన వివరాల ప్రకారం, విమాన మళ్లింపు తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ మృతదేహం గురువారం నుంచి మస్కట్ లోనే ఉందని తెలిపారు.మఖ్సూబ్ సాహిబ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ ఒక మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్తుడని అంతేకాక ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆయనకు జ్వరం వచ్చింది. మేము సౌదీ విమానాశ్రయం వద్ద మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ కు చికిత్స చేయించాం. విమాన ప్రయాణం చేయడానికి తగిన ఆరోగ్యంతో ఆయన ఉండటంతో బయలుదేరాం. మేము చివరిసారి చూసినపుడు ఆయన విమానంలో నిద్ర పోతున్నారు. ఆ తరువాత, మళ్ళీ మేము ఆయనను పరిశీలించగా చనిపోయినట్లుగా గుర్తించామని వివరించారు. దాంతో మేము విమాన సిబ్బందికి ఈ సమాచారం తెలియచేశాం అని అన్నారు . వెనువెంటనే ఆ విమానం ఒమన్ వైపునకు మళ్ళించబడి అత్యవసరంగా గగనతలం నుండి కిందకు దిగవలసి వచ్చిందని, ఇదే విమానంలో మహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ భార్య, బంధువులు ఉన్నారని మఖ్సూబ్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







