ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం...
- November 25, 2016
ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢకొీనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు, సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి చికిత్స నిమిత్తం తరలించారు. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్ రైలును ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రతినిధులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







