లైసెన్స్ ప్లేట్ల వేలం: 6 మిలియన్ ఖతారీ రియాల్స్
- November 25, 2016
యూనిక్ లైసెన్స్ ప్లేట్ల కోసం నిర్వహించిన ఆన్లైన్ వేలం ద్వారా 5.58 మిలియన్ ఖతారీ రియాల్స్ ఆదాయం ఖతార్ ప్రభుత్వానికి సమకూరింది. రెండు నెలల క్రితం సెప్టెంబర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 17 మిలియన్ ఖతారీ రియాల్స్‌ని ఆన్లైన్లో యూనిక్ నంబర్‌ప్లేట్స్ వేలం వేయడం ద్వారా ఆర్జించింది. తాజాగా లభించిన ఆదాయం గతంతో పోల్చి చూస్తే తక్కువే. ఐదవ సారి ఆక్షన్ మంగళవారం 22 నవంబర్ నుంచి నిన్నటి అర్థరాద్రి వరకు జరిగింది. 22 ఆరు డిజిట్ల ప్లేట్స్ ఆక్షన్ వేయబడ్డాయి. 333300 నంబర్ అత్యధికంగా 638,000 ఖతారీ రియాల్స్‌ని ఆర్జించింది. 311113 నంబర్ ప్లేట్ గత సెప్టెంబర్‌లో 2,304,000 ఖతారీ రియాల్స్‌ని సంపాదించిపెట్టింది. అతి తక్కువ మొత్తం నిన్నటి ఆక్షన్‌లో 393399 నంబర్‌కి (130,000 ఖతారీ రియాల్స్) వచ్చింది. ఆక్షన్‌లో పాల్గొన్నవారంతా 20,000 ఖతారీ రియాల్స్‌ని డిపాజిట్ చేయవలసి ఉంటుంది. 22 యూనిక్ నెంబర్ ప్లేట్స్ 100,000 ఖతారీ రియాల్స్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







