క్రిస్టమస్ సీజన్ లో నాని....
- November 27, 2016
వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నానికి టైం కూడా బాగా కలిసొస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు హిట్స్ అందించిన నాని, ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేనులోకల్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ చివరలో రిలీజ్ చేస్తున్నాడు. సాధారణంగా టాలీవుడ్ లో క్రిస్టమస్ సీజన్ అంటే బడా స్టార్ల సినిమాలు పోటిలో ఉంటాయి.కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అలా లేదు. సీనియర్ హీరోలందరూ సంక్రాంతికే బరిలో దిగుతుంటే, యంగ్ జనరేషన్ స్టార్లు సమ్మర్ రిలీజ్ ల కోసం ప్రీపేర్ అవుతున్నారు. దీంతో క్రిస్టమస్ సీజన్ లో నాని తప్ప మరే హీరో బరిలో దిగటం లేదు.రామ్ చరణ్ ధృవ సినిమా క్రిస్టమస్ కు రెండు వారాల ముందే రిలీజ్ అవుతుండటంతో నేనులోకల్ పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని భావిస్తున్నారు. ఇక నాని సినిమాకు వారం ముందే థియేటర్లలోకి వస్తున్న సూర్య, సింగం 3 ఒక్కటే నానికి పోటి అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్ లోమంచి ఫాలోయింగే ఉన్నా సింగం 3 పక్కా మాస్ ఎంటర్ టైనర్ కావటంతో., ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న నానికి పెద్దగా పోటి కాకపోవచ్చన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







