నడిగర్ సంఘం సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు..
- November 27, 2016
దక్షిణ భారత నటీనటుల(నడిగర్) సంఘం 63వ సర్వసభ్య సమావేశంలో భాగంగా సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు. పరమపదించిన సినీ దిగ్గజాలను స్మరించుకుంటూ వారి పేరిట పురస్కారాలు ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ నేతృత్వంలో చెన్నై టి.నగర్లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ఊర్వశి శారదకు 'భానుమతి' పురస్కారం, వాణిశ్రీకి 'అంజలీదేవి' అవార్డును ప్రదానం చేశారు. సీనియర్ కళాకారులను సత్కరించడం గౌరవప్రదంగా ఉందని ఈ సందర్భంగా కమల్హాసన వ్యాఖ్యానించారు.కాగా, నడిగర్ సంఘం నిధులను దుర్వినియోగం చేశారంటూ మునుపటి కార్యవర్గ సభ్యులైన శరతకుమార్, రాధారవిలను శాశ్వతంగా సంఘం నుంచి తొలగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇది కోలీవుడ్లో దుమారం రేపుతోంది. శరతకుమార్ సతీమణి, నటి రాధిక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, శరతకుమార్ను తొలగించిన విషయం పొక్కగానే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు విశాల్ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.అంతకుముందు సమావేశం ప్రారంభంలోనూ కొందరు సభ్యులు రసాభాస సృష్టించగా, వారికి తమకు ఎటువంటి సంబంధం లేదని శరతకుమార్, రాధారవి వెంటనే వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







