భారత్ బంద్ తెలుగురాష్ట్రాల్లో అంతంత మాత్రం..
- November 27, 2016
నోట్ల రద్దుకు నిరసనగా వాపపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ తెలుగురాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఉంది. విపక్షాలు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నాయి. ఈ ఉదయం ఆందళనకారులు బస్‌డిపోల ఎదుట బైఠాయించారు. హైదరాబాద్‌లో బంద్ ప్రభావం కనిపించడం లేదు. రోడ్లపై బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్: * కడప: బంద్ సందర్భంగా జిల్లాలోని బస్టాండ్దగ్గర బస్సులను అడ్డకున్న సీసీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. * నెల్లూరు: బంద్ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. కాగా ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవు ఎస్పీ విశాల్‌గున్ని హెచ్చరించారు.
* కర్నూలు: పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర వైసీపీ, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆదోని డిపో ఎదుట బస్సులను వామపక్ష నాయకులు అడ్డుకున్నాయి. దీంతో ఆదోని టూటౌన్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. * గుంటూరు: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.
వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలు చేపట్టారు. * ప్రకాశం: పెద్దనోట్ల రద్దుకు నిరసనగా చీరాలలో వైసీపీ, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. * విశాఖ: పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ నగరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. * అనంతపురం: నోట్ల రద్దును నిరసిస్తూ ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు బస్టాండ్ దగ్గర బస్సులను అడ్డుకున్నారు.
దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ: * మహబూబాబాద్ జిల్లా: భారత్ బందులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో బస్సు డిపో ఎదుట ధర్నాకు దిగారు. దీంతో బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. * సూర్యాపేట: ఆర్టీసీ డిపో ఎదుట లెఫ్ట్ నేతల ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. రోడ్లపై బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. దుకాణాలు సైతం తెరుచుకున్నాయి. * భద్రాద్రి: నోట్లరద్దు నిరసనగా అశ్వరావుపేటలో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించారు.
వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







