స్టంట్ మాస్టర్ శివతో సంతానం ఫైటింగ్
- November 29, 2016
కోలీవుడ్‌లో హాస్య నటుడిగా ప్రసిద్ధి చెందిన సంతానం హీరోగాను నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా వాసన్ విజువల్ వెంచర్స్ అనే సినీ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 'ఓడి ఓడి ఉలైక్కనుం' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా అమేరా దస్తర్ హీరోయిన్‌గా నటించనుంది. ఇందులో యోగి, బాబు, నాన్ కడవుల్ రాజేంద్రన్, స్వామినాథన్, వూర్వశి, మధుసూదనరావు, మన్సూర్ ఆలీఖాన్, మయిల్‌స్వామి తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణల బాధ్యతలను జ్ఞానగిరి చేపట్టగా, కె.ఎస్.మణికంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఎడిటింగ్ రామారావు, స్టంట్స్ సిల్వ అందిస్తున్నారు. 'ఓడి ఓడి ఉలైక్కనుం' చిత్రం కోసం ఇటీవల చెన్నైలో ఒక ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. విలన్‌గా నటిస్తున్న స్టంట్ మాస్టర్ శివతో సంతానం ఫైటింగ్ దృశ్యాలను చిత్రీకరించారు. అందులో డూప్ లేకుండా తలకిందులుగా వేలాడుతూ, అతి ఎత్తు నుంచి కిందకు దూకి సంతానం అదరగొట్టారు.చిత్ర యూనిట్ ఆయనను కరతాళ ధ్వనులతో అభినందించింది. అన్నట్టు... సంతానం కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందారట. స్టంట్ సూక్ష్మాలను తెలుసుకోవడం ఈ షూటింగ్‌కు మరోబలంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ సమాచారం.షూటింగ్ జోరుగా సాగుతోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







