డిసెంబర్ 23న `లక్ష్మీ బాంబ్'...
- November 29, 2016
గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం `లక్ష్మీ బాంబ్'. ఫ్రమ్ శివకాశి అనేది చిత్ర ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించారు. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్‌ఫుల్ రోల్‌లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర ఆడియోను విడుదల చేయగా, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సింగిల్ షెడ్యూల్ లో పూర్తి అయిన ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







