30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించనున్న కాంచన..
- November 29, 2016
అలనాటి దక్షిణాది మేటి నటి కాంచన దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించబోతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న తెలుగు సినిమా అర్జున్ రెడ్డిలో ఆమె నటించనున్నట్టు దర్శకుడు సందీప్ వంగా చెప్పాడు. ఎంతో కష్టపడి కాంచనతో మాట్లాడగలిగామని, సినిమాలో నటించేందుకు తొలుత ఆమె అంగీకరించలేదని, సుదీర్ఘ చర్చల అనంతరం ఒప్పుకున్నారని సందీప్ తెలిపాడు. విజయ్‌కు బామ్మగా కాంచన నటించనుందని, సినిమాలో ఆమెది కీలక పాత్రని చెప్పాడు.ఈ బుధవారం నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందని తెలిపాడు. కాంచన వయసు 77 ఏళ్లు. ఆమె చివరిసారిగా శ్రీదత్త దర్శనం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా 1985లో విడుదలైంది.ఆత్మగౌరవం, నవరాత్రి, ప్రైవేట్ మాస్టర్ వంటి తెలుగు సినిమాలతో ఆమె పాపులర్ అయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







