డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల ...
- November 29, 2016
విజయవాడ నగరంలో ఒకప్పుడు సంచలనం రేపిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నాడని అనౌన్స్ చేయగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ ఈ సినిమా తీస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో గ్రాండ్‌గా చేయనున్నారు.చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. 'విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న వంగవీటి నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







