డ్రగ్స్ ట్రేడ్: వలసదారుడికి 10 ఏళ్ళ జైలు
- November 29, 2016
ఓ వలసదారుడికి డ్రగ్స్ ట్రేడ్‌లో పాల్గొన్నందుకు, అలాగే డ్రగ్స్ తీసుకుంటున్నందుకుగాను పదేళ్ళ జైలు శిక్షను, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానాను విధించింది న్యాయస్థానం. డ్రగ్స్ ప్రివెన్షన్ డిపార్ట్‌మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, నిందితుడికి సంబంధించిన సమాచారం అందుకోగానే, ఇన్‌స్పెక్టర్స్ మెరుపు దాడుల్ని నిర్వహించారు. నిందితుడి ఇంట్లో దాచి ఉంచిన డ్రగ్స్‌ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో వైపున ఐటీ షాపులు పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ కాపీలను కలిగి ఉన్నందుకుగాను వాటికి జరీమానాలు విధించడం జరిగింది. దోహా న్యాయస్థానం, ఐటీ షాప్‌లకు 10,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది. ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌ని డూప్లికేట్ చేస్తున్నందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







