యూఏఈ అమరవీరుల్ని స్మరించుకున్న షేక్ మొహమ్మద్
- November 29, 2016
యూఏఈ కమ్మెమరేషన్ డే సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. సివిల్, మిలిటరీ, హ్యుమానిటేరియన్ విభాగాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఈ సందర్బంగా షేక్ మొహమ్మద్ ఘన నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన అమరవీరుల త్యాగాల్నీ, వారి ధైర్య సాహసాల్ని గుర్తు చేసుకుంటూ కమ్మెమరేషన్ డే నిర్వహించుకోవడం జరుగుతోంది. యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్ని, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్నీ ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అభినందించారు. అమరవీరుల వారసులుగా మనల్ని మనం గొప్పగా చెప్పుకునే రోజు ఇదనీ, ప్రతి ఒక్కరూ దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని షేక్ మొహమ్మద్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







