తమిళ చిత్ర సీమలో అరుదైన వ్యక్తిత్వం హీరో విశాల్‌ది
- November 29, 2016
తమిళ చిత్ర సీమలో అరుదైన వ్యక్తిత్వం హీరో విశాల్‌ది. తన పని తాను చేసుకుని కోట్లు వెనకేసుకుందాం అనుకునే రకం కాదు. అన్యాయాన్ని ఎదురించి పోరాడే మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే వ్యక్తిత్వం గలవాడు. ఇది వరకే ఎంతో మందికి సహకరించిన విశాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. రజనీకాంత్, విజయకాంత్ వంటి తమిళ స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన వెటరన్ సంగీత దర్శకుడు చంద్రబోస్ కుటుంబానికి విశాల్ సహాయం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. చంద్రబోస్ మరణం తర్వాత ఆయన భార్య చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్త ఉన్నప్పుడు ఎంతో వైభవోపేతంగా బతికిన ఆమె వద్ద ప్రస్తుతం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు.ఈ విషయం తెలుసుకున్న విశాల్ స్వయంగా ఆమెను కలిసి డబ్బులు అందజేశాడట. విశాల్ చేసింది చిన్న సహాయమే అయినప్పటికీ.. ఈ సమయంలో ఆమెకు ఇది చాలా పెద్ద సహాయం. ఇలాంటి సహాయాలతో విశాల్ తెరపైనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







