కువైట్‌లో సౌదీ కింగ్ పర్యటనపై ఆశలు
- November 29, 2016
కువైట్ సిటీ: సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, వచ్చే వారం కువైట్‌లో పర్యటించనుండడంతో ఎమిరేట్‌లో ఆయన పర్యటన పట్ల ఆశలు రేకెత్తుతున్నాయి. రెండేళ్ళ మూసివేత తర్వాత సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆయిల్ ఫీల్డ్ పునః ప్రారంభం కానుంది. డిసెంబర్ 8న కింగ్ సల్మాన్, కువైట్‌కి రానున్నారు. బహ్రెయిన్‌లో జరిగే గల్ఫ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకుగాను మూడు రోజులపాటు ఆయన కువైట్‌లో ఉండనున్నారు. కువైట్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, సౌదీ అరామ్‌కో గల్ఫ్ ఆపరేషన్స్ సంయుక్త నిర్వహహనలో ఉన్న ఖఫ్జి ఫీల్డ్‌కి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇరు పక్షాలూ. అక్టోబర్ 2014లో ఖఫ్జి ఫీల్డ్ ఔట్ పుట్‌ని ఆపివేశారు. రోజుకి 300,000 బ్యారెల్స్ చమురు ప్రొడక్షన్ ఇక్కడి నుంచి జరుగుతుండేది. ఇందులో చెరి సగం వినియోగించుకునేవి కువైట్, సౌదీ అరేబియా. ఈ ఫీల్డ్ మూసివేతతో సౌదీ అరేబియా కంటే కువైట్‌కి ఎక్కువగా సమస్యలొచ్చాయి. అలాగే సౌదీ అరేబియా కొన్ని నెలల తర్వాత రెండో షేర్డ్ ఫీల్డ్‌ని కూడా మూసివేసింది. అదే ఫ్రా ఫీల్డ్. 200,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి ఇక్కడి నుంచి జరిగేది. ఈ నేపథ్యంలో కువైట్, ఆ సంస్థకు సంబంధించిన వలసదారులకు వీసాలను నిరాకరించింది. అయితే కింగ్ సల్మాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు పెరుగుతాయని ఆశిస్తున్నారంతా.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







