నిత్యనూతన తారలంటే శ్రీదేవి, మాధురీ దీక్షిత్
- November 29, 2016
శ్రీదేవి, మాధురీ దీక్షిత్.వీళ్ల వయసు యాభై ఏళ్ల పైనే. అందం మాత్రం ముప్పైలో ఆగిపోయింది. నిన్నటితరం నాయికలు ఎక్కడైనా బయట కనిపిస్తే.అప్పట్లో ఎలా ఉండేది అనుకుంటారు. కానీ శ్రీదేవి, మాధురీ కనిపిస్తే.ఇంచుమించు అలాగే ఉన్నారే అని ఆశ్చర్యపడతారు. ఓ తరం తెరపై ఆస్వాదించిన సౌందర్యం ఇద్దరిదీ. నాయికల్లో వీళ్లకున్న ఆకర్షణ అసాధారణం. కథా కథనాలు, హీరోలు, దర్శకులు ..ఇవన్నీ వదిలేసి వీళ్ల అందాన్ని చూసేందుకు సినిమాలకు వెళ్లే ఆరాధకులున్నారు.
అభిమానులున్నారు. నువ్వేమన్నా శ్రీదేవివా, మాధురీ వా అన్నంతగా జనబాహుల్యంలో మార్మోగిపోయిన పేరు వీళ్లది. దశాబ్దాలుగా వెండితెరను వెలిగించిన ఈ అందాల తారలు.తరుచుగా సినిమాలు చేయకున్నా.అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నారు. ఐదు పదుల్లోనూ గ్లామర్ కాపాడుకోవడం మాటలు కాదు.
అదెంత కష్టమో మనకు అనుభవమే. ఇటీవల క్విజ్ కార్యక్రమంలో శ్రీదేవి, మాధురీ ఉత్సాహంగా పాల్గొన్నారు. కెరీర్ విశేషాల గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. తమ ఫేవరేట్ పాటలకు కలిసి డాన్సులు చేశారు.
నిత్యనూతన తారలంటే ఎలా ఉంటారో చూపించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







