పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ...
- November 29, 2016
పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పడుతోంది. బ్రిటన్ లోని భారతీయులంతా తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాటిని స్నేహితులు, బంధువులు, మరెవరైనా తెలిసిన వారు లేదా మధ్య వర్తుల ద్వారా తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను విమానాల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం డిపాజిట్ చేసేందుకు, ఆర్బీఐలో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ నోట్లు డిసెంబర్ తర్వాత నేరుగా ఆర్బీఐకి వెళితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని భారతీయులు తమ వద్ద ఉన్న పాత డబ్బుకు కంగారు పడుతున్నారు.
ప్రస్తుతం దీన్ని విదేశాల్లో మార్పిడి చేసుకునే అవకాశం కూడా లేదు.
బ్రిటన్ లో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతీయులు 2.5శాతం మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడి కోసం ఎంత కంగారు పడుతున్నారో గుజరాత్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ గుజరాతీ ఆర్గనైజేషన్ యూకే(ఎన్సీజీవో) అధ్యక్షుడు సీజే రాభేరు తెలిపారు. రోజుకు కొన్ని వందల్లో ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియక కంగారు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, రూమర్లను నమ్ముతున్నారని అన్నారు. దాదాపు 10లక్షల మంది బ్రిటన్ భారతీయులపై పెద్ద నోట్ల ప్రభావం పడిందని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







