మహిళలూ డ్రైవింగ్ చేయొచ్చు: అల్వలీద్
- November 30, 2016
రియాద్: బిలియనీర్ సౌదీ ప్రిన్స్ అల్వలీద్, సోషల్ మీడియా ద్వారా మహిళలూ డ్రైవింగ్ చేయవచ్చునని స్పష్టం చేశారు. దేశంలో మహిళల డ్రైవింగ్‌పై ఉన్న బ్యాన్‌ని ఎత్తివేయాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. ఈ అంశంపై చర్చ అనవసరం అని అల్వలీద్ అభిప్రాయపడ్డారు. సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన అల్వలీద్ ఎలాంటి పొలిటికల్ పదవులూ నిర్వహించకపోయినా, అనేక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఫిలాంత్రపిస్ట్ అల్వలీద్, కింగ్‌డమ్‌లోని మహిళల హక్కుల కోసం అడ్వకేట్‌గా పోరాడుతున్నారు. డ్రైవింగ్ నుంచి మహిళను దూరంగా ఉంచడమంటే, ఆమెకుండాల్సిన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నట్లేనని ప్రిన్స్ అల్వలీద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మహిళలు ట్యాక్సీలను నడపడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పిన అల్వలీద్, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. సమాజంలో మార్పు వస్తే ఏదైనా సాధ్యమేనని ఈ సందర్భంగా అల్వలీద్ చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







