అల్ బలీద్ రిసార్ట్ సలాలా ప్రారంభం
- November 30, 2016
అల్ బలీద్ రిసార్ట్ సలాలా బై అనంతర బుధవారం ప్రారంభం కానుంది. సుల్తాన్ కబూస్ బిన్ సైద్ కల్చరల్ అడ్వైజర్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ రోవాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మ్యూజియమ్ ఆఫ్ ది ఫ్రాంకిన్‌సెన్స్ ల్యాండ్ మరియు అల్ బలీద్ ఆర్కియలాజికల్ పార్క్ సమీపంలో ఈ రిసార్ట్‌ని ఏర్పాటు చేశారు. సలాలా నుంచి మంచి రోడ్ నెట్‌వర్క్ ఈ రిసార్ట్‌కి అందుబాటులో ఉంది. అలాగే సీ వ్యూ కూడా ఈ రిసార్ట్‌కి అదనపు ఆకర్షణ. సలాలాలో తొలి లగ్జరీ రిసార్ట్‌గా అల్ బలీద్ రిసార్ట్ రికార్డులకెక్కనుంది. 96 2/3 రూమ్ విల్లాస్, ఇందులో 88 విల్లాస్‌కి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ఇవి కాకుండా 40 హోటల్ రూమ్స్, వీటిల్లో 30 రూమ్స్‌కి సీ వ్యూ ఉండేలా తీర్చిదిద్దారు. పలు అకేషన్స్‌కి వీలుగా మల్టిపుల్ హాల్స్ ఈ రిసార్ట్‌లో ఉంటాయి. స్పోర్ట్స్, రిక్రియేషన్, హెల్త్, రిటెయిల్ ఔట్‌లెట్స్, మూడు ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ కోసం అకామడేషన్ సైకర్యాల్ని కల్పించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







