వేలం సొమ్ముని చెల్లని చెక్కు రూపంలో ఇచ్చిన ఫాన్సీ నెంబర్ గ్రహీత అరెస్ట్
- November 30, 2016
అబుధాబి: చెక్కుతో ఒకటో నెంబర్ ప్లేట్ దక్కించుకున్న వ్యక్తికి అది కాస్త బౌన్స్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ఫాన్సీ నెంబర్ కోసం పలువురితో పోటీ పడి తుదకు 31 మిలియన్ డి హెచ్ మొత్తాన్ని వేలం పాటలో పాడి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చి ఒకటో నెంబర్ ప్లేట్ ను ఎగరేసుకుపోయిన ఒక ఎమిరేట్ వ్యాపారవేత్త పై ఇపుడు చెల్లని చెక్కు ఇచ్చిన నేరంపై కేసు నమోదైంది. ఈ నెల నవంబర్ 19 వ తేదీన అబూధాబీ లో జరిగిన కారు నెంబర్ ప్లేట్ వేలంలో 1 వ నెంబర్ ఫాన్సీ ప్లేట్ ను దక్కించుకున్న వ్యక్తికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏడు రోజుల కస్టడీకి పంపింది. వ్యాపారవేత్త అయిన ఎ.ఎ.ఎం ఫాన్సీ సంఖ్య ప్లేట్ వేలం కోసం తన ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినప్పటికీ ఆవేశంతో చెక్ రాసిన తర్వాత ఆ ఖాతాలో డబ్బు లేకపోవడంతో ఆ వ్యక్తిపై మోసం చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయని ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







