హెచ్-1బీ వీసా టెర్మినేట్ అయినా 60 రోజులు ఉండొచ్చు...
- November 30, 2016
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపు భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులలో ఒకపక్క గుబులు రేపుతుండగా, అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) నిబంధనలలో చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పటికే హెచ్-1బీ వీసా పొందిన వారికి సానుకూలంగా మారాయి. నవంబరు 18న యూఎ్‌ససీఐఎస్ ప్రచురించిన అంతిమ నిబంధన ప్రకారం.... ఇది వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికాకు వచ్చి పనిచేసే వృత్తి నిపుణుల హెచ్-1బీ వీసాను ఏ కారణం చేతనైనా ఇమిగ్రేషన్ అధికారులు టెర్మినేట్ చేసిన పక్షంలో, వారు అక్కడ కొనసాగేందుకు ప్రభుత్వం 60 రోజుల వ్యవధి ఇవ్వనుందిఈలోగా వారు స్వదేశానికి వెళ్లడమో లేక కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోడానికి అనుమతిస్తారు. కాగా, హెచ్4 వీసా ఉన్నవారి విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా కీలక మార్పుగా చెప్పవచ్చు. హెచ్-1బీ వీసా కలిగిన వారి జీవితభాగస్వాములుగా అమెరికాకు వచ్చే హెచ్4 వీసాకలిగిన వారి ఉద్యోగ నియామకాల ధ్రువీకరణ విషయంలో ఇచ్చిన వెసులుబాటు వల్ల వారికి ఇబ్బందులు తొలగినట్టే. ఈ కొత్త నిర్ణయంవల్ల హెచ్4 వీసా కింద అమెరికా వచ్చి పనిచేసే ఉద్యోగులు తమ గడువు పొడిగింపునకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడకుండా యథాప్రకారం పనిచేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







