కేంద్రం బంగారంపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధo...
- November 30, 2016
బ్లాక్ బాబుల భరతం పట్టే చర్యల్లో భాగంగా కేంద్రం బంగారంపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవనున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా దీనిపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇతర దేశాలకు భిన్నంగా భారతీయ మహిళలు బంగారంపై మక్కువ పెంచుకుని ఉంటారు. ఈ క్రమంలో తమకు వీలైనంత మేర ఎంతోకొంత బంగారాన్ని కొని పెట్టుకుని ఉంటారు. కొందరు అలంకారం కోసం.. మరికొందరు ఆపదలో ఆదుకుంటుందనే ఉద్దేశ్యంతో బంగారం నగలు, ఆభరణాలు కొనుగోలు చేసుకుని ఉంటారు. ఇక బ్లాక్ మనీ ఎక్కువగా ఉన్న వారు బిస్కెట్ల బంగారం రూపంలో నిల్వ చేస్తుంటారు. సహజంగా దంపతులు ఉద్యోగులైతే ప్రతి ఏడాది కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు.
కొంత మంది కొన్ని రకాల చీరలకు అనుగుణంగా బంగారం డిజైన్లను చేయించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఆంక్షలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియడంతో కుబేరుల కుటుంబానికి చెందిన వారి మాటేమో కాని సామాన్య, మధ్య తరగతి మహిళల్లో గుబులు రేగింది. పరిమితికి మంచి అక్రమ సంపాదనతో వజ్ర,వైడుర్యాలు కొనుగోలుచేసేవారిపై నిఘా పెట్టాలి. బంగారంపై పరిమతి 60 గ్రాములని పరిమితి విధించడం సరికాదు.
దీనికి మరింత పెంచాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ప్రభుత్వం మహిళ ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బంగారంపై ఆంక్షలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లలో ఉండే బంగారు ఆభరణాల లెక్కలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు.
కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకుంటున్నట్లుగా లేదు. పాత చట్టాల ప్రకారం ప్రతి ఇంటిలో మహిళకు 500 గ్రాముల బంగారు నగలు, భర్తకు 100 గ్రాములు, కుమార్తెకు 100 గ్రాములు, కుమారుడికి 50 గ్రాములు బంగారు ఆభరణాలు ఉంచుకోవచ్చు. ప్రతి ఇంటిలో సంప్రదాయాల ప్రకారం బంగారు ఆభరణాలు సంక్రమిస్తుంటాయి. ఈ పరిమితి దాటిన ఆభరణాలకు తగిన లెక్క చూపించాల్సి ఉంటుంది.
ఆభరణాల కొనుగోలుపై కేవలం ఒక్క శాతం మాత్రమే పన్ను చెల్లించి బిల్లు తీసుకుని భద్రపరుచుకోవాలి.ప్రభుత్వం నిర్ధేశించిన 60 గ్రాముల బంగారానికి ఒడ్డాణం కూడా రాదు. బంగారం కొనుగోలుపై ఇప్పటికిప్పుడు నిఘా పెట్టడం సరికాదు. ప్రజల్లో అవగాహ కల్పించాలి. ఎంతోమంది దాచుకున్న సొమ్ముతో బంగారం కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఆంక్షలు విధించాలనే నిర్ణయం సమంజసం కాదు. బంగారంపై మహిళలకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు కష్టపడి బంగారం కొని దాచుకుంటే దానిపై నిషేధం... సీలింగ్ విధానాలు ప్రతిపాదించాలనే ఆలోచనలు మంచిది కాదు.
నిజంగా నల్లడబ్బును బంగారం రూపంలో మార్చుకునే వారిపై చర్యలు తీసుకోవాలి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అనే చందంగా కేంద్రం మధ్యతరగతి, సామాన్య గృహుణులు కష్టపడి కొనుగోలు చేసిన బంగారంపై ఆంక్షలు విధించడం మంచిదికాదు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







