చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది...జయసుధ
- December 01, 2016
సీనియర్ నటి జయసుధ ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తున్న 'హెడ్ కానిస్టేబుల్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజుల కిందట నిర్మాతకు, జయసుధకు మధ్య అపార్థాల వల్ల విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరోజు షూటింగ్ వాయిదా పడింది.చిత్ర వర్గాల ప్రకారం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిర్ణీత సమయంలోగా జయసుధకు దుస్తులు అందించలేకపోయింది. దీంతో ఆమె కొంతవేచి చూసి.. ఆలస్యంగా షూటింగ్‌కు వచ్చింది. విషయం తెలియని నిర్మాత ఆగ్రహానికి లోనయ్యాడు. జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలు వేశాడు. నిర్మాత కోపానికి గురైన విషయం తెలియడంతో జయసుధ ఆయనకు వివరణ ఇచ్చింది.ఇందులో తన తప్పేం లేదని తెలిపింది. గత 30 ఏళ్లుగా జయసుధ తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటున్నది. ఇందుకోసం ఒకరోజు ముందుగానే దర్శకుడితో సంబంధిత సీన్లోవేసుకోవాల్సిన దుస్తుల కోసం ఆమె చర్చిస్తుంది. దీనిపై జయసుధ మీడియాతో స్పందిస్తూ 'ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది. దర్శకుడు నాకు ఫోన్ చేశాడు. ఎలాంటి జాప్యం లేకుండా డిసెంబర్ 3 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది' అని తెలిపారు. ఆర్ నారాయణమూర్తి కోసమే ఈ సినిమాను జయసుధ ఒప్పుకొన్నట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







