ఓబీసీ కేంద్ర జాబితాలో మార్పుచేర్పులకు ప్రభుత్వం ఆమోదం..
- December 01, 2016
ఓబీసీ కేంద్ర జాబితాలో మార్పుచేర్పులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో కొత్తగా 15 కులాలను చేర్చడంతోపాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈమేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు
జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ) అస్సాం, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లకు సంబంధించి 28 మార్పులను సిఫార్సు చేసింది. ఈ మార్పులతో ఆయా కులాలకు చెందిన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కోటా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఓబీసీలోని సంపన్న వర్గాలకు (క్రీమీలేయర్) కొన్ని మినహారుుంపులిచ్చే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి భారత్‌లో ఉంటున్న శరణార్థుల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్ల ప్యాకేజీని కేబినెట్ ఆమోదించింది. ఈ కుటుంబాలు దాదాపుగా 36,384 ఉన్నారుు. వీరికి రూ.5.5 లక్షల చొప్పున ఇస్తారని సీనియర్ అధికారి చెప్పారు.
విదేశీ పర్యాటకులను, వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీసా సడలింపు నిబంధనలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. దీనిప్రకారం విడివిడిగా ఉన్న పర్యాటక, వ్యాపార, వైద్య, కాన్ఫరెన్స వీసాలను ఒక్కటిగా కలుపుతారు. ఈ దీర్ఘకాల వీసా వల్ల విదేశీయులు దేశంలో పదేళ్ల వరకు ఉండవచ్చు. శాశ్వతంగా ఉండటానికి లేదా ఉద్యోగం చేయడానికి మాత్రం అనుమతించరు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







