షారుక్ సినిమాలో అతిథిగా రణ్‌బీర్ కపూర్..
- December 01, 2016
ఈ మధ్య హీరోలు పలు సినిమాల్లో అతిథి పాత్రలు చేయడం సాధారణమైపోయింది. ఇటీవల రణ్‌బీర్ కపూర్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. ఈ చిత్రానికి దర్శకుడైన కరణ్ జోహార్ షారుక్‌కు మంచి స్నేహితుడు కావడంతో అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు.అయితే.. ఇప్పుడు షారుక్ సినిమాలో అతిథిగా కనిపించే అవకాశం రణ్‌బీర్ కపూర్‌కు వచ్చింది. ఎలా అంటే..షారుక్, అనుష్క శర్మ జోడీగా దర్శకుడు ఇంతియాజ్ అలీ 'ది రింగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపించబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. యూరప్‌లో తాను పొగొట్టుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ కోసం అన్వేషిస్తున్న అమ్మాయిగా అనుష్క శర్మ.. ఆమెకు గైడ్‌గా షారుక్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే అనుష్కకు కాబోయే భర్త పాత్రలో ఎవర్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో పడ్డాడు ఇంతియాజ్. 'యే దిల్ హై ముష్కిల్'లో అనుష్క, రణ్‌బీర్‌ల మధ్య కెమిస్ట్రీ ఇంతియాజ్‌కు బాగా నచ్చడంతో రణ్‌బీర్‌ను ఆ పాత్ర చేయమని అడిగాడట. 'తమాషా' చిత్రంతో రణ్‌బీర్‌కి ఆయన హిట్ ఇచ్చాడు. ఆ అభిమానంతో రణ్‌బీర్ కూడా అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడట. త్వరలో రణ్‌బీర్‌పై సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు సమాచారం.
విశేషం ఏమిటంటే షారుక్, రణ్‌బీర్‌లు ఓ అంతర్జాతీయ సినిమా కోసం త్వరలో కలిసి నటించబోతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







