వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్ మరియు కుటుంబ సభ్యులు
- September 02, 2015
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. వైయస్ జగన్ బుధవారం ఉదయం తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలతో కలిసి తన సొంత ఎస్టేట్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకున్న జగన్, తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. ఈరోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అనంతరం పంజాగుట్టలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







