పద్దతి మార్చుకుంటేనే చర్చలకు అగీకరిస్తాం
- December 01, 2016
దేశ సరిహద్దుల్లో పదేపదే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌ను భారత్ మరోసారి హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పులకు దిగుతూ ఇది సరికొత్త సాధారణ స్థితి అన్నట్లుగా వ్యవహరించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. ముందు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని భారత్‌పైకి ఎగదోయడాన్ని నిలిపివేస్తేనే చర్చలు సాధ్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటనలో తేల్చి చెప్పారు. ద్వైపాక్షిక చర్చల కోసం పాక్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పిన ఆయన ..
చర్చల విషయంలో భారత్ ఎప్పుడూ సుముఖంగానే ఉందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని చెప్పారు. మరోవైపు నగ్రోటా దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలిశాక తమ తదుపరి చర్యలు ఉంటాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. దేశ భద్రతకు ఏది అవసరమో అదే చేస్తామని స్పష్టం చేసింది. సార్క్ సమావేశాలను భారత్‌మాత్రమే రద్దు చేయించలేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సు నిర్వహించొద్దని అన్ని సభ్య దేశాలు ఏకాభ్రిపాయంతో నేపాల్‌కు లేఖ రాశాయని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







