షూటింగ్ పూర్తిచేసుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'
- December 01, 2016
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్ పూర్తయింది. చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రను పోషిస్తున్న హేమమాలిని ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. సినిమా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. రెండో శతాబ్దానికి చెందిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 100వ చిత్రంగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై.
రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







