నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనున్న 'ఆధార్'
- December 01, 2016
మీ ఆధార్ కార్డు మీద 12 అంకెల సంఖ్య త్వరలో నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఆధార్‌తో జరిగే లావాదేవీలు కార్డ్‌లెస్, పిన్ లెస్‌గా వుంటాయని యూఐడీఏఐ డైరెక్టర్ జనరల్ అజయ్‌పాండే తెలిపారు. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోనువాడకం దారులు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరిగే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్‌లో తయారుచేసే మొబైల్ కంపెనీలు ఐరిస్, ఫింగర్ ప్రింట్‌ను గుర్తించే విధంగా తయారుచేయమని సూచించినట్టు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా వ్యాపార,వాణిజ్య సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా వున్న చిన్న వ్యాపారస్థులకు కూడా పలు రాయితీలు ఇస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణాసుందరరాజన్ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







