తెలుగులోకి మోహన్ లాల్ మరో చిత్రం
- December 02, 2016
ఈ ఏడాది జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్ ఇప్పుడు మరో మలయాళ చిత్రాన్ని టాలీవుడ్ కి తీసుకురాబోతున్నాడు. 2016 ఓనం కానుకగా విడుదలైన ఒప్పం చిత్రంను కనుపాప టైటిల్ తో తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒప్పం చిత్రంలో మోహన్ లాల్ అంధుడిగా కనిపించగా, ఈ చిత్రం దృశ్యం రికార్డులను చెరిపేసింది. మలయాళంలో ఇటీవల భారీ వసూళ్ళు సాధించిన పులిమురుగన్ చిత్రం తర్వాత ఒప్పం హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఒప్పం చిత్రం హిందీ, కన్నడ భాషలలోను రీమేడ్ కానుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







