షూటింగ్‌లో రజనీకాంత్‌కు స్వల్ప గాయం
- December 03, 2016
డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 2.0 మూవీ షూటింగ్‌లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ స్వల్పంగా గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో.. షూటింగ్ స్పాట్ నుంచి ఆస్పత్రికి వెళ్లిన రజనీ.. అక్కడ చికిత్స చేయించుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయారట. చిన్న గాయమే అయినా.. రజనీకాంత్ అభిమానులు మాత్రం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2.0 మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలో వేసిన సెట్‌లో.. చిత్రంలోని ఓ కీలక సన్నివేశం చిత్రిస్తుండగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుడికాలికి గాయమైంది. వర్షం కారణంగా మెట్లపై నడుస్తుండగా ఒక్కసారిగా జారి ఆయన పడిపోయారు. చెన్నై, కెలంబాక్కం సమీపంలోని ఓ ఐటీ కంపెనీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని మూవీ యూనిట్ తెలిపింది. గాయమైన వెంటనే సూపర్‌స్టార్‌ను హాస్పత్రికి తరలించి చికిత్స అందించారని, ఆస్పత్రి నుంచి రజనీ నేరుగా ఇంటికెళ్లి పోయారని చెప్పారు. చికిత్స అందించిన డాక్టర్లు, మూవీ యూనిట్ మాట్లాడుతూ.. రజనీ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2.0 మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ పోషించగా, రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటిస్తున్నారు. 2.0 మూవీ బడ్జెట్ 400 కోట్లకు చేరడంతో.. ఆసియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాగానూ రికార్డులకెక్కనుంది. రజనీకి గాయమైందన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకుని.. షూటింగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







