'వంగవీటి' ఆడియో వేడుక...
- December 04, 2016
వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రౌడీయిజం, రాజకీయాలు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ముందు నుంచి చెబుతున్నారు. అయితే, సినిమా విషయంలో వంగవీటి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సీన్ సీరియస్ అయ్యింది. శనివారం వర్మ-వంగవీటి రాథా ల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఎవరికి వారు తగ్గేది లేదని తేల్చిచెప్పారు. దీంతో.. 'వంగవీటి' సినిమా రిలీజ్ విషయం మరింత హీట్కెక్కింది.ఈ సీరియస్ సీన్ ఇలా కొనసాగుతుండగానే విజయవాడలో శనివారం రాత్రి 'వంగవీటి' ఆడియో వేడుక జరిగింది. కేయల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. "నేను దర్శకుడిని కాకముందు నుంచి నాకు ఈ కథ గురించి తెలుసు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా"నన్నారు.సందీప్‌కుమార్, నైనా గంగూలీ, వంశీ, కౌటిల్య, శ్రీతేజ, ప్రజ్ఞ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రాజశేఖర్ పన్నాల, రవి శంకర్ లు సంగీతం సమకూర్చారు. దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







