గోవాలో యువతకు కొత్త పథకం
- December 04, 2016
కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు డిజిటల్ ఇండియాను ఆవిష్కృతం చేసేందుకు గోవా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. ఉచిత ఇంటర్నెట్ డేటా, టాక్‌టైంను రేపటి నుంచి గోవాలోని యువతకు అందించనుంది. 'గోవా యువ సంచార్ యోజన' పథకాన్ని సోమవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం కింద 16-30 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ కొత్త సిమ్ పంపిణీ చేసి దాని ద్వారా 100 నిమిషాల టాక్‌టైం, 3జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వెల్లడించారు. ఈ మేరకు వొడాఫోన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ పథకం ద్వారా దాదాపు 1.25లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి నవంబర్ 25వ తేదీన గోవా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు పర్సేకర్ తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







