'ఆన్‌లైన్' టాక్స్ చెల్లింపులు
- December 04, 2016
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నగదు రహిత పన్నులు వసూళ్లు చేయడమే లక్ష్యంగా బల్డియా పాలకవర్గం, అధికారులు కృషి చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్య పరిష్కర దిశలో భాగంగా పలు ప్రయత్నాలు జరుగు తున్నాయి. గతంలో ఇంటింటికి వెళ్లి పన్నులు చెల్లించండి బాబూ అంటూ గిరికీలు కొట్టే సిబ్బందికి కొంత ఊరట లభించింది. కలెక్టర్ భారతి హోళికేరి రైతులకు సంబంధించిన లావాదేవీలను స్వైప్‌మిషన్ల ద్వారా అలవాటు చేయాలని ఇప్పటికే పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలకు కూడా పన్ను వసూళ్లు చేసేందుకు నేటి నుంచి స్వైప్ మిషన్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్వైప్ మిషన్లతో వ్యాపార, వాణిజ్య, దుకాణాల కిరాయిలను వసూళ్లు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.పట్టణం మొత్తం ఈ విధానాన్ని అనుసరించేందుకు మరో 10 స్వైప్ మిషన్లు కావాలని ఎస్‌బీహెచ్ అధికారులను కోరినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







