హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం, 11 మంది సజీవదహనం
- December 04, 2016
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని రెజెంట్ ప్లాజా హోటల్‌లో ఉదయం భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవదహనమయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వంటగదిలో చెలరేగిన మంటలు కొద్దిసేపట్లోనే ఆరో అంతస్థు వరకు వేగంగా వ్యాపించాయి. మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. హోటల్‌లో బస చేస్తున్న కొందరు తప్పించుకునేందుకు హోటల్ భవనంపై నుంచి దూకేశారు. దీంతో కొందరికి ఎముకలు విరగగా మరికొందరికి గాజు పెంకులు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మృతుల్లో ఎక్కువమంది వూపిరాడక ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు వైద్యులుకూడా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్‌లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు సహాయక బృందం చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







