యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- August 02, 2026
అబుదాబి: యూఏఈలో ఈ ఏడాది వేసవిలో తొలిసారిగా ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలోని అల్ షవామేఖ్ ప్రాంతంలో 50°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో యూఏఈలో 50 డిగ్రీల మార్క్ నమోదవడం ఇదే తొలిసారి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 31న అల్ ఐన్‌లోని స్వైహాన్ ప్రాంతంలో 49.6°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
యూఏఈలో అత్యంత వేడిగా ఉండే 'జమ్రత్ అల్ ఖైత్' (వేసవి తీవ్రత గరిష్ఠ స్థాయి) కాలం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ దశ ఆగస్టు 10 వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా 41°C నుంచి 43°C మధ్య నమోదవుతుండగా, లోతట్టు, ఎడారి ప్రాంతాల్లో 45°C నుంచి 46°C వరకు చేరుతున్నాయి. తీవ్రమైన వడగాలుల సమయంలో కొన్ని అంతర్గత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50°C కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







