కాంగోలో భద్రతాబలగాలు, ట్రైబల్ తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 31 మంది మృతి
- December 06, 2016
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో భద్రతాబలగాలు, ట్రైబల్ తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. సెంట్రల్ షికాపా రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కసాయ్ ప్రావిన్స్ గవర్నర్ వెల్లడించారు.షికాపా ప్రాంతంలోకి వెళ్లిన భద్రతా బలగాలు, పోలీసులపై స్థానిక తెగ తిరుగుబాటుదారులు దాడి చేసి ఆయుధాలను లాక్కొని హతమార్చారు. అనంతరం అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కూడా వారు దాడికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల పరస్పర కాల్పుల్లో 13 మంది భద్రతా సిబ్బంది, 18 మంది తిరుగుబాటు దారులు మృతి చెందారు. మరో 13 మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







