యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా...
- December 06, 2016
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి వరుస హిట్స్ అందించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన జూనియర్ ఆ తరువాత అదే జోరును కంటిన్యూ చేసే కథ కోసం ఎదురుచూస్తున్నాడు. యంగ్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాలను లైన్ లో పెడుతుంటే ఎన్టీఆర్ మాత్రం సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా చాలా రోజుల పాటు కాలీగా ఉండిపోయాడు.
ఈ గ్యాప్ లో చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన ఎన్టీఆర్, ఫైనల్ గా తన నెక్ట్స్ సినిమాకు ముహుర్తం ఫిక్స్ చేశాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తదుపరి సినిమాను ప్రారంభించానున్నాడు ఎన్టీఆర్.
పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ, తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచాడు. తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న బాబీ, ఎన్టీఆర్ కు కథ చెప్పి ఒప్పించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







