సెల్వరాఘవన్ దర్వకత్వం,అనీల్ సుంకర నిర్మాణ o
- December 06, 2016
14 రీల్స్ బ్యానర్ లో భాగస్వామిగా ఉన్న అనీల్ సుంకర, తన సొంత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలు సాధించారు. ఈ దసరాకు ఈడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో తొలిసారిగా ఓ తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా కోలీవుడ్, టాలీవుడ్ లలో మంచి పేరున్న సెల్వరాఘవన్ దర్వకత్వంలో కావటం మరో విశేషం.ప్రస్తుతం ఎస్ జె సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన నెంజం మరప్పుదిల్లై సినిమా పనుల్లో బిజీగా ఉన్న సెల్వ.. ఆ సినిమా తరువాత ఓ వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు. హీరోగా మారిన కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను లోబడ్జెట్ లో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు సెల్వ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ఏకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







