దేశానికి సినిమా హబ్‌గా హైదరాబాద్....
- December 06, 2016
దేశానికి సినిమా హబ్‌గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చారిత్రక ప్రదేశాల వద్ద సినిమా షూటింగ్‌ల కోసం ఏర్పాట్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా సినిమా అవార్డులను అందచేయనుందని తెలిపారు. అవార్డుకు నంది పేరు మారిస్తే ఏ పేరు పెట్టాలన్న అంశాన్ని రమణాచారి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అవార్డులకిచ్చే పారితోషికం, జాతీయ అవార్డుకు ఎవరి పేరు పెట్టాలో కమిటీయే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
చిన్న సినిమాలు థియేటర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు త్వరలో ఐదో ఆటకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో చిత్రనగరిని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







