ఫ్రాన్స్ ప్రధానిగా బెర్నార్డ్ కజెనూవ్
- December 06, 2016
ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బెర్నార్డ్ కజెనూవ్ను నియమిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే మంగళవారం ప్రకటించారు. బెర్నార్డ్ ప్రస్తుతం ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఫ్రాన్స్ ప్రధాని మాన్యుల్ వాల్స్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బెర్నార్డ్ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. 2017లో జరగనున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపు నుంచి మాన్యుల్ బరిలో దిగుతుండటం వల్లే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బెర్నార్డ్కు బలమైన వ్యక్తిత్వముందని, దేశ వ్యవహారాల్లో అనుభవముందని అందుకే ఆయనను ప్రధానిగా నియమిస్తున్నట్లు హొలాండే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







