జయ అంత్యక్రియలు పూర్తి
- December 06, 2016
అశేష జనవాహిని అశ్రునయనాల మధ్యకేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు చెన్నై మెరీనా బీచ్‌లో పూర్తయ్యాయి. జయలలిత రాజకీయ గురువు ఎంజేఆర్ సమాధికి సమీపంలోనే ఆమెను ఖననం చేశారు. త్రివిధ దళాల సైనికాధికారులు గౌరవ వందనం సమర్పించగా, వైష్ణవ గురువు పర్యవేక్షణలో శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు, త్రివిధ దళాల అధికారులు అంత్యక్రియల క్రతువులో పాల్గొన్నారు.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్‌లు అంత్యక్రియలకు హాజరయ్యారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, తంబిదురై, మాజీ గవర్నర్ రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌నేత గులాంనబీ ఆజాద్, ఏఐఏడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు జయలలిత పార్థివదేహం వద్ద చివరిసారిగా నివాళులర్పించారు. అమ్మను కడసారి చూసేందుకు వచ్చిన అశేష జనంతో మెరీనా బీచ్ కన్నీటి సంద్రమైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







