తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
- December 06, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(93) తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఇంతకు ముందు కూడా శ్వాసకోశ సమస్యలతో లీలా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
దిలీప్‌కుమార్ 1922లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా అయిన దిలీప్ కుమార్ తండ్రితో పడక ఇంటినుంచి వచ్చేసి పూణేకు చేరుకుని అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహించారు. అనంతరం బాంబేకు చేరుకుని బాంబే టాకీస్ ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన అసలు నేరు యూసఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్‌గా మార్చుకుని జ్వర్ భట (1944) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటనుంచి ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ ట్రాజెడీ కింగ్‌గా పేరుతెచ్చుకున్నారు. 1998లో చివరి చిత్రం ఖిలా లో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2015 లో పద్మవిభూషణ్ అవార్డులు దిలీప్‌ను వరించాయి. భార్య అలనాటి ప్రముఖ అందాల బాలీవుడ్ నటి సైరాబాను.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







