ఇండోనేషియాలో భూకంపం, 25 మంది మృతి

- December 06, 2016 , by Maagulf
ఇండోనేషియాలో భూకంపం, 25 మంది మృతి

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు దాదాపు 25 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.03 గంటల సమయంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. 2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున రాక్షస అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయారు. ఇండోనేషియా ద్వీప సమూహం తరచూ భూకంపాలకు గురవుతూ ఉంటుంది. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్ ‌ ఫైర్ ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి ప్రధానకారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతాల కారణంగా భూమిపొరల్లో కదలికలు ఏర్పడుతుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com