ఇండోనేషియాలో భూకంపం, 25 మంది మృతి
- December 06, 2016
ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు దాదాపు 25 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.03 గంటల సమయంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. 2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున రాక్షస అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయారు. ఇండోనేషియా ద్వీప సమూహం తరచూ భూకంపాలకు గురవుతూ ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి ప్రధానకారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతాల కారణంగా భూమిపొరల్లో కదలికలు ఏర్పడుతుంటాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







