'ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డుల' కు యుఏఈ నుండి ఐదుగురి ఎంపిక
- December 09, 2016 
ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 26 మంది ఎన్నారైలు ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 కు ఎంపికయ్యారు. మొదటి జాబితాలో యుఏఇ నుండి ఐదుగురు ఎన్నారైలకు చోటు దక్కింది. చివరి జాబితా త్వరలో విడుదల కానున్నది. కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానం జరుగుతుంది. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన ప్రవాస భారతీయ (ఎన్నారై), భారత సంతతి (పిఐఓ) లను నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో వారు అందించిన సేవలను గుర్తించి ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించి అవార్డులను ప్రధానం చేయనున్నామని 'కోట' వ్యవస్థాపక అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు.
కంమ్యూనిటీ సర్వీసెస్ క్యాటగిరీలో కె.కుమార్, కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) క్యాటగిరీలో అడ్వొకేట్ షరీఫ్ నూరుల్లా, ఆన్ లైన్ మీడియా ద్వారా సేవలందిస్తున్న మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, సక్సస్ఫుల్ ఇంటర్ప్రెనర్ క్యాటగిరీలో కూలీ నుంచి యజమానిగా ఎదిగిన జైత నారాయణ, సక్సస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, సోషల్ లీడర్, గుడ్ సమరిటన్ క్యాటగిరీలో ఇ.తులసి ప్రసాద్ ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 లకు ఎంపికయ్యారు.
నామినేషన్లను ఈ అవార్డుల కమిటీ పరిశీలించింది: ప్రొ.ఆడప సత్యనారాయణ (చైర్), కట్ట కవిత (కో- చైర్), అరుణా నాయుడు నిమ్మగడ్డ (మెంబర్), డా.కె.స్వరూపా రెడ్డి (మెంబర్), నిజాం వెంకటేశం (మెంబర్), పి. సునీల్ కుమార్ రెడ్డి (మెంబర్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







