ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం
- December 11, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం చేశారు. ఒకప్పుడు గుప్పిట్లో ఉన్న సిరియా ప్రాచీన నగరం పామిరాను కోల్పోయి దాదాపు తొమ్మిది నెలలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడని ఉగ్రవాదులు తిరిగి ప్రవేశించారు. పామిరాకు వెలుపల ఉన్న ఎడారి ప్రాంతంలో మూడువైపుల నుంచి ఏక కాలంలో దాడులు చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులు తిరిగి చొరబడ్డారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి.రోమన్ సంస్కృతికి చెందిన పలు కట్టడాలన్నీ కూడా సిరియాలోని పామిరాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంపై విపరీతంగా దాడులు చేసి పురాతన కట్టడాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ప్రతిగా సిరియా బలగాలు కూడా వరుసదాడులు చేసి తొమ్మిది నెలల కిందట అక్కడ ఐసిస్ లేకుండా తుదముట్టించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







