ఇంట్లో చిన్న వ్యాపార కార్యకలాపాలకు ఇక లైసెన్స్ అవసరం
- December 11, 2016
కతర్: ఇంట్లో నిర్వహించుకొనే చిన్న వ్యాపార కార్యకలాపాలకు కుటుంబాలకు లైసెన్సులను ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వశాఖ మంజూరు చేయనున్నట్లు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. ఈ చొరవ కారణంగా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడానికి మరియు చిన్నవ్యాపారాలను ప్రోత్సాహించడానికి ఎంతో ఉపయోగ పడుతుందని శనివారం తెలిపింది. ఈ కార్యక్రమం క్రింద, ఇంట్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకొనేందుకు మంచి అవకాశమని మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి నిర్వహణకు అధిక ధర అవసరం లేదని వ్యక్తిగత నైపుణ్యాల మీద ఆధారపడి ఇవి కొనసాగుతాయని పేర్కొన్నారు. కలవరం కల్గించే పరికరాలు లేదా ప్రమాదకర పదార్థాల ఉపయోగించుకునే పరిస్థితి ఉండదని తెలిపారు. లాభం మాత్రమే లక్ష్యంగా మరియు లైసెన్స్ దారుడు జీవన ఖర్చులు అందించడానికి ఇంట్లో నిర్వహించుకొనే చిన్నవ్యాపార కార్యకలాపాలకు లైసెన్సులను కుటుంబంకు మంజూరు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లో సాధన చేసే అంశాలు ఏమిటంటే వివాహా వీడియో చిత్రీకరణ మరియు కుట్టుపని సేవలు ఉన్నాయి; అపురూప వస్తువులు మరియు బహుమతులు తయారుచేసుకోవచ్చు. వస్తువుల ప్యాకేజింగ్ బహుమతులు; చేతితో తయారు చేసే కార్డులు మరియు బహుమతుల రూపకల్పన; సహజ మరియు కృత్రిమ పుష్పాల తయారీ ఏర్పాటు; ఇంజినీరింగ్ కంపెనీలపై స్పెషాలిటీ పరిధిలో ఇంజనీరింగ్ మినహాయించి కంప్యూటర్ ఆధారిత నమూనాలు ,ఎలక్ట్రానిక్ సేవలు; అటువంటి వంట, కాపీ, ప్యాకేజింగ్ మరియు పాఠశాల పాఠ్యపుస్తకాల బైండింగ్ పని వ్యాపార సేవలు సుగంధ తయారీ, "ద్కహౌం " (ఔధ్) మరియు అందం పెంపొందించుకొని ఉత్పత్తులు; టీ , సుగంధ ద్రవ్యాలు మరియు భోజనం తయారు మరియు ఆహార కార్యకలాపాలను ఇంటివద్ద నుంచి నిర్వహించుకోవచ్చు. ఈ లైసెన్స్ పొందటానికి, దరఖాస్తుదారు కనీసం 18 సంవత్సరాల వయస్సు మరియు ఇంటి నివాసి ఉండాలి. వార్షిక లైసెన్స్ రుసుము 1,020 కతర్ రియళ్ళు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







